మాదాపూర్(నమస్తే శేరిలింగంపల్లి): మాదాపూర్ డివిజన్ పరిధిలోని ప్రతీ బస్తీ, కాలనీలలో పూర్తిస్థాయి మౌలిక వసతులను ఏర్పాటు చేసి అభివృద్ధి చేస్తానని స్థానిక కార్పొరేటర్ జగదీశ్వగౌడ్ అన్నారు. బుధవారం డివిజన్ పరిధిలోని సుభాష్ చంద్రబోస్ నగర్ లో నూతనంగా నిర్మితమవుతున్న సిసి రోడ్ పనులను జగదీశ్వర్ గౌడ్ స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు. అనంతరం బస్తీలో పర్యటించి స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వెనువెంటనే పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాదాపూర్ డివిజన్ టిఆర్ఎస్ జనరల్ సెక్రటరీ సాంబశివరావు, బస్తి అధ్యక్షులు ముఖ్తర్, ఆదిత్య నగర్ బస్తి టిఆర్ఎస్ అధ్యక్షులు ఖాసీం, కృష్ణ కాలనీ బస్తి టిఆర్ఎస్ అధ్యక్షులు కృష్ణ యాదవ్, సైబర్ వ్యాలీ అధ్యక్షులు సత్తి రెడ్డి, నాయకులు రెహ్మాన్, రామకృష్ణ, సత్యనారాయణ, మహిళలు శశిరేఖ, శ్రీజ రెడ్డి,మొగులమ్మ, పద్మ, శిరీష తదితరులు పాల్గొన్నారు.