తెలుగు వారి కీర్తిని న‌లుదిశ‌లా వ్యాపింప‌జేసిన వ్య‌క్తి ఎన్‌టీఆర్‌: ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

హైద‌ర్‌న‌గ‌ర్‌‌ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): తెలుగువారి గుండెల్లో చెరగని ముద్రను చిరస్థాయిగా వేసుకున్న నాయకుడు ఎన్టీఆర్ అని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. సోమ‌వారం ఎన్‌టీఆర్ 25వ వ‌ర్ధంతి సంద‌ర్భంగా హైద‌ర్‌న‌గ‌ర్‌లోని అల్లాపూర్ సొసైటీలో ఉన్న ఆయ‌న విగ్ర‌హానికి కార్పొరేటర్లు నార్నె శ్రీనివాస రావు, ఉప్పలపాటి శ్రీకాంత్ ల‌తో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ పూల‌మాల‌లు వేసి నివాళులు అర్పించారు. ఈ సంద‌ర్బంగా గాంధీ మాట్లాడుతూ ఎన్టీఆర్ రాజ‌కీయాల‌కు కొత్త నిర్వ‌చ‌నం ఇచ్చార‌ని అన్నారు. పార్టీ పెట్టిన అన‌తి కాలంలోనే సీఎం అయి స‌త్తా చాటార‌న్నారు. తెలుగు వాడి కీర్తిని న‌లుదిశ‌లా చాటి చెప్పార‌ని అన్నారు. ఈ కార్యక్ర‌మంలో తెరాస నాయకులు రంగరాయ ప్రసాద్, పోతుల రాజేందర్, అష్రాఫ్, అప్పిరెడ్డి, శివా రెడ్డి, కుమార స్వామి, ప్రభాకర్ రెడ్డి, నర్సింహ రావు, కాలనీ వాసులు హరి బాబు, శ్రీధర్, కిరణ్ పాల్గొన్నారు.

ఎన్‌టీఆర్ విగ్ర‌హానికి పూల‌మాల‌లు వేస్తున్న ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ
ఎన్‌టీఆర్ విగ్ర‌హం వ‌ద్ద నివాళులు అర్పిస్తున్న ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ, కార్పొరేటర్లు నార్నె శ్రీనివాస రావు, ఉప్పలపాటి శ్రీకాంత్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here