చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్ లోని సుప్రజ రెసిడెన్సీలో శేరిలింగంపల్లి అసెంబ్లీ మున్నూరు కాపు సంఘం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కాచిగూడ మున్నూరు కాపు విద్యార్థి వసతి గృహం ట్రస్టీ మ్యాడం కిషన్ రావుకి నివాళులు అర్పించారు. ఈ నెల 26వ తేదీన చందానగర్‌లోని క్రిస్టల్ గార్డెన్‌లో ఉదయం 10 గంటలకు నిర్వహించనున్న శేరిలింగంపల్లి మున్నూరుకాపుల ఆత్మీయ సమ్మేళనంలో ప్రతి డివిజన్ నుండి మున్నూరు కాపులు అధిక సంఖ్యలో పాల్గొనాలని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకుని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సంఘం ప్రముఖులు తుడి ప్రవీణ్ పిలుపునిచ్చారు. అనంతరం మెదక్ ఉమ్మడి జిల్లా, శేరిలింగంపల్లి సభ్యత్వం నమోదు అప్లికేషన్, మున్నూరుకాపు సమగ్ర సర్వే యాప్, మున్నూరుకాపు స్టికర్ లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నందనం విష్ణుదత్ పటేల్ తదితరులు పాల్గొన్నారు.