నేతాజీ నగర్ కాలనీ అభివృద్ధే ల‌క్ష్యం: భేరి రామచందర్ యాదవ్

గ‌చ్చిబౌలి (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి‌): నేతాజీ నగర్ కాలనీ అభివృద్ధే ల‌క్ష్యంగా ప‌నిచేస్తున్నామ‌ని కాల‌నీ వెల్ఫేర్ అసోసియేష‌న్ అధ్య‌క్షుడు భేరి రామ‌చంద‌ర్ యాద‌వ్ అన్నారు. కాల‌నీలో కొన‌సాగుతున్న యూజీడీ ప‌నుల‌ను ఆయ‌న బుధ‌వారం ప‌రిశీలించారు. ఈ సంద‌ర్బంగా ఆయ‌న మాట్లాడుతూ కాల‌నీల్లో యూజీడీలు నిండిపోవ‌డంతో సంబంధిత అధికారుల‌కు తెలియ‌జేసి స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రిస్తున్నామ‌ని అన్నారు. కాల‌నీలో ఎలాంటి స‌మ‌స్య‌లు ఉన్నా వెంట‌నే ప‌రిష్క‌రించేందుకు చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో అసోసియేష‌న్ ఉపాధ్య‌క్షుడు ఎండీ క‌మ‌ర్ పాషా, రమేష్ గుప్తా, రాజు, అశోక్, బాలకృష్ణ, రాఘవేంద్ర, బన్సీలాల్, నరేష్, రఘురాములు, శ్రీకాంత్, కాలనీవాసులు పాల్గొన్నారు.

యూజీడీ ప‌నుల‌ను ప‌రిశీలిస్తున్న భేరి రామచంద‌ర్ యాద‌వ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here