శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలో బుధవారం ప్రజలు భోగి పండుగను ఉత్సాహంగా జరుపుకున్నారు. వేకువ జామునే లేచి భోగి మంటలు వేసి ఆనందించారు. ఆలయాల్లో భక్తుల సందడి నెలకొంది. తల్లిదండ్రులు ఈ సందర్బంగా తమ చిన్నారులపై భోగి పండ్లను వేసి ఉత్సాహంగా గడిపారు.
భోగి పండుగను జరుపుకున్న ఆరెకపూడి గాంధీ…
ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ తన నివాసంలో కుటుంబ సభ్యులతో కలిసి భోగి పండుగను జరుపుకున్నారు. ఉదయం భోగి మంటను వేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ భోగి పండుగ ప్రజల జీవితాల్లో సుఖ శాంతులను తీసుకురావాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. అనంతరం ఆయన శేరిలింగంపల్లి ప్రజలకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.









