శ్రీరామ్ నగర్ వాసులకు కృతజ్ఞతలు: కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్

శేరిలింగంప‌ల్లి‌‌‌‌ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంప‌ల్లి డివిజ‌న్ ప‌రిధిలోని శ్రీరామ్ నగర్ వాసుల‌కు కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ కృతజ్ఞతలు తెలిపారు. శనివారం ఆయ‌న‌ను స్థానికులు సన్మానించారు. ఈ సంద‌ర్బంగా కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ మాట్లాడుతూ శ్రీరామ్ నగర్ కాలనీ అంటే త‌న‌కు గుండెకాయలాంటిదని, అదే నమ్మకాన్ని వమ్ము చేయకుండా కాలనీ వాసులు త‌న‌కు మళ్ళీ ఓటేసి త‌న విజయంలో‌ కీలక పాత్ర పోషించారని అన్నారు. ఏ సమస్య ఉన్నా పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో కాల‌నీ అధ్య‌క్షుడు వి. జగన్ మోహన్ రెడ్డి, వెంకటేశ్వర్ రావు, శేఖర్, నాగరాజు, మోహన్ రెడ్డి, శోభ, నాగరాణి, గోపీ నగర్ బస్తీ కమిటీ గౌరవ అధ్య‌క్షుడు గోపాల్ యాదవ్, కొయ్యాడ‌ లక్ష్మణ్ యాదవ్, శ్రీకాంత్ యాదవ్, ప‌ట్లోళ్ల నర్సింహా రెడ్డి పాల్గొన్నారు.

కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ను స‌న్మానించిన శ్రీరామ్ నగర్ వాసులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here