పేద‌ల సంక్షేమానికి ప్ర‌భుత్వం పెద పీట‌: ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

శేరిలింగంప‌ల్లి‌ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): పేద‌ల సంక్షేమానికి ప్ర‌భుత్వం పెద్ద పీట వేస్తుంద‌ని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. శేరిలింగంప‌ల్లిలోని ప‌లు ప్రాంతాల‌కు చెందిన ల‌బ్ధిదారుల‌కు మంజూరైన క‌ల్యాణ ల‌క్ష్మి, షాదీ ముబార‌క్ చెక్కుల‌ను ఆయ‌న బుధ‌వారం కార్పొరేటర్లు ఉప్పలపాటి శ్రీకాంత్, నార్నె శ్రీనివాస రావుల‌తో కలిసి పంపిణీ చేశారు.

ల‌బ్ధిదారుల‌కు చెక్కుల‌ను అంద‌జేస్తున్న ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ, కార్పొరేటర్లు ఉప్పలపాటి శ్రీకాంత్, నార్నె శ్రీనివాస రావు

ఈ సంద‌ర్భంగా గాంధీ మాట్లాడుతూ.. ప్ర‌భుత్వానికి క‌రోనా వ‌ల్ల చాలా వ‌ర‌కు ఆదాయానికి గండి ప‌డింద‌ని, అయిన‌ప్ప‌టికీ సంక్షేమ ప‌థ‌కాల‌ను మాత్రం ఆప‌లేద‌ని అన్నారు. తెరాస ప్ర‌భుత్వం పేద‌ల‌కు అండ‌గా ఉంటుంద‌ని, సీఎం కేసీఆర్ పేద‌ల ప‌క్ష‌పాతి అని అన్నారు. ఈ కార్యక్రమంలో మోజేష్, పోతుల రాజేందర్. రాజేష్ చంద్ర, తిరుపతి, శ్రీనివాస్ చౌదరి, రాము, అంజలి పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here