చిన్న ప్రైవేటు విద్యాసంస్థ‌ల స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాలి

  • ఎంపీ బండి సంజ‌య్‌కు విన‌తి

శేరిలింగంప‌ల్లి‌‌ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): రాష్ట్రంలోని చిన్న ప్రైవేటు విద్యాసంస్థ‌ల స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాల‌ని కోరుతూ మాదాపూర్ డివిజ‌న్ బీజేపీ నాయ‌కుడు గంగ‌ల రాధాకృష్ణ యాద‌వ్ ఆధ్వ‌ర్యంలో తెలంగాణ స్మాల్ ప్రైవేట్ ఎడ్యుకేష‌న‌ల్ ఇనిస్టిట్యూష‌న్ అసోసియేష‌న్ స‌భ్యులు సోమ‌వారం ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్‌కు విన‌తిప‌త్రం అంద‌జేశారు. ఇందుకు సంజ‌య్ సానుకూలంగా స్పందించార‌ని రాధాకృష్ణ యాద‌వ్ తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో నాయ‌కులు రాంచంద‌ర్‌, న‌రేంద‌ర్ బాబు, శ్రీ‌నివాస్‌, విజ‌య్‌, పుల్లా రెడ్డి, శేరిలింగంపల్లి మండల ప్రైవేట్ స్కూల్ కరస్పాండెంట్స్‌ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎం.శ్రీనివాసరావు, జనరల్ సెక్రెటరీ పి.జై జగదీష్, ట్రెజరర్ డి.విజయ్ కుమార్, వైస్ ప్రెసిడెంట్ ఎస్.రాజేశ్వరరావు, అడ్వైజర్స్ బందా నరేంద్ర బాబు, బరుసు వెంకటేశ్వరరావు, వి.ఫణికుమార్, స్టేట్ స్పోర్ట్స్ పర్సన్ చింతల రామచంద్ర, స్టేట్ ట్రస్మా సెక్రెటరీ ఎస్ ఎన్ రెడ్డి, స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ అనిల్ కుమార్, శేరిలింగంపల్లి మండల ప్రైవేటు స్కూల్ కరస్పాండెంట్స్ అసోసియేష‌న్‌ సభ్యులు పాల్గొన్నారు.

ఎంపీ బండి సంజ‌య్‌కి విన‌తిప‌త్రం అంద‌జేసిన రాధాకృష్ణ యాద‌వ్‌, చిన్న ప్రైవేటు విద్యాసంస్థ‌ల యజ‌మానులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here