చందానగర్(నమస్తే శేరిలింగంపల్లి): పార్టీకోసం కష్టపడి పనిచేసే కార్యకర్తలకు టిఆర్ఎస్ లో సముచిత స్థానం లభిస్తుందని ఆలేరు ఎమ్మెల్యే, చందానగర్ డివిజన్ ఎన్నికల ఇంచార్జ్ గొంగిడి సునీత అన్నారు. ఇటీవల పార్టీనుండి కాంగ్రెస్ లో చేరిన మహిళా నాయకురాలు వినోద రెడ్డి బృందం తిరిగి టిఆర్ఎస్ పార్టీలో చేరారు.

మాజీ కౌన్సిలర్ సునీత ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన గొంగిడి సునీత పార్టీలో చేరిన వారికీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా గొంగిడి సునీత మాట్లాడుతూ తెరాస తోనే రాష్ట్రానికి, పార్టీ కార్యకర్తలకు ఉజ్వల భవిష్యత్తు ఉందన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.