రాఘవేంద్ర నగర్ లో ఘనంగా‌ గణేష్ నవరాత్రోత్సవాలు

నమస్తే శేరిలింగంపల్లి: గణేష్ నవరాత్రోత్సవాల్లో భాగంగా కొండాపూర్ డివిజన్ పరిధిలోని రాఘవేంద్ర నగర్ కాలనీలో వార్డ్ మెంబర్ నిర్మల, శ్రీ గణపతి మహిళా స్వశక్తి సంఘం, కాలనీ వాసుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక నవరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించారు. బుధవారం ప్రత్యేక పూజలు చేసి అన్నదాన‌ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. పిల్లలకు, పెద్దలకు ఆటలపోటీలు నిర్వహించి గెలుపొందిన‌ వారికి‌ మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో మాదాపూర్ కార్పొరేటర్ జాతీయ తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు భేరి రాంచందర్ యాదవ్, బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షుడు తెనుగు నర్సింలు ముదిరాజ్, ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ఉప్పరి శేఖర్ సగర, ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ రామస్వామి యాదవ్, మియాపూర్ కాంగ్రెస్ కాంటెస్టెడ్ కార్పోరేటర్ ఇలియాజ్ షరీఫ్, బిజెపి కాంటెస్టెడ్ కార్పోరేటర్ రఘునాథ్ యాదవ్, నాయకులు కృష్ణ గౌడ్, రాజేష్ యాదవ్, కాంగ్రెస్ నాయకులు తిరుపతి, కాలనీ వాసులు రామకృష్ణ, శ్రీకాంత్, సంఘం సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here