చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్ డివిజన్ తెరాస అభ్యర్థిగా మంజుల రఘునాథ్ రెడ్డి శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో నామినేషన్ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మంజుల రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ తనకు ఈ అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్, ఎంపీ రంజిత్ రెడ్డి, ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీలకు కృతజ్ఞతలు తెలిపారు. చందానగర్ డివిజన్ కార్పొరేటర్‌గా గెలిస్తే డివిజన్ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తానని తెలిపారు. చందానగర్ ప్రజలకు అన్ని వేళలా అందుబాటులో ఉంటానన్నారు. ప్రజా సమస్యలను తన సమస్యలుగా భావించి వాటి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. డివిజన్ ప్రజలు కారు గుర్తుకు ఓటు వేసి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఎన్నికల్లో భారీ మెజారిటీతో విజయం సాధిస్తామని ఆమె ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో చందానగర్ డివిజన్ తెరాస అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి, నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.