అక్టోబ‌ర్ 13, 2020, మంగ‌ళ‌వారం రాశి ఫ‌లాలు, ప‌రిహారాలు

మేష రాశి…

శారీరక సౌష్ఠవం కోసం క్రీడలలో ఎక్కువ సమయం గడుపుతారు. కుటుంబంలో ఎవరైనా అనారోగ్యానికి గురైతే ఆర్ధిక సమస్యలను ఎదుర్కొంటారు. డబ్బుకంటే కుటుంబానికే అధిక‌ ప్రాధాన్యత ఇవ్వాల్సి వ‌స్తుంది. బంధువుల నుంచి బ‌హుమ‌తులు అందుతాయి. వారు సహాయం ఆశిస్తారు. క్రొత్త ప్రాజెక్ట్ లు, ఖర్చులను వాయిదా వేస్తే మంచిది. స్నేహితుల‌తో స‌మ‌యం గ‌డుపుతారు. మత్తుపానీయాలు, ధూమపానం స్వీక‌రించ‌కూడ‌దు.

ప‌రిహారం: శ్రీకుజగ్రహ ఆరాధన, శుక్రగ్రహారాధన చేస్తే మంచిది.

వృషభ రాశి…

జీవిత భాగ‌స్వామి విష‌యాల్లో త‌ల‌దూర్చ‌కూడ‌దు. అప్పు తీసుకున్న‌వారు ఇచ్చే అవ‌కాశం ఉంది. స‌మ‌యానికి ఎంత ప్రాధాన్య‌త ఇవ్వాలో తెలుసుకుంటారు. ఈ రోజు మీకు ఎక్కువ స‌మ‌యం ల‌భిస్తుంది. ఆట స్థ‌లం లేదా జిమ్‌కు వెళ్లే అవ‌కాశం ఉంది. ఈ రోజును మీరు వినియోగించుకోవాలి.

ప‌రిహారం: తల్లి, అమ్మమ్మ లేదా ఇతర వృద్ధ మహిళల నుండి దీవెనలు పొందితే మంచిది.

మిథున రాశి…

స్నేహితుల కోసం డ‌బ్బును పార్టీలో ఎక్కువ‌గా ఖ‌ర్చు చేస్తారు. ఆర్థికంగా స‌మ‌స్య‌లు ఉండ‌వు. దూర‌ప్రాంతాల‌కు చెందిన బంధువులు సంప్ర‌దిస్తారు. ప‌నిలో క‌లిగే మార్పుల‌కు ప్ర‌యోజ‌నం చేకూరుతుంది.

పరిహారం: ఆకుపచ్చ రంగు దుస్తులను ధరించాలి.

కర్కాటక రాశి…

ప్ర‌తి ఒక్క‌రూ చెప్పేది జాగ్ర‌త్త‌గా వినాలి. మీ స‌మ‌స్య‌ల‌కు ఆ విష‌యాల్లో ప‌రిష్కారం ల‌భించే అవ‌కాశం ఉంది. ఇంటికి సంబంధించి ఖ‌రీదైన వ‌స్తువుల‌ను కొంటారు. ఆర్థిక స‌మ‌స్య‌లు వ‌చ్చే అవ‌కాశం ఉంది. జీవిత భాగ‌స్వామితో సంబంధాలు దెబ్బ తినే అవ‌కాశం ఉంటుంది. ప్రాజెక్టుల‌ను చేప‌ట్టేందుకు మంచి స‌మ‌యం. ఈ రోజు చ‌క్క‌ని ఆహారం తింటారు. సంతోషంగా ఉంటారు.

ప‌రిహారం: తెల్ల రంగు ఉన్న పక్షులు లేదా సాధు జంతువులకు ఆహారం పెట్ట‌డం ద్వారా ఆర్థిక స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.

సింహ రాశి…

మ‌న‌స్సును ప్ర‌శాంతంగా ఉంచుకునే ప‌నులు చేయండి. ఏదైనా ప‌ని చేసే ముందు అందులో ఉండే లోటుపాట్ల‌ను గ‌మ‌నించ‌డం మంచిది. బంధువులు బ‌హుమ‌తులు ఇచ్చే అవ‌కాశం ఉంది. నిరుద్యోగులు ఉద్యోగ ప్ర‌య‌త్నం చేస్తే విజ‌యం సాధించే అవ‌కాశం ఉంది.

ప‌రిహారం: వాయువ్య దిశలో ఒక తెల్లని బల్బును ఉంచాలి. ఇది కుటుంబంలో స‌మ‌స్య‌ల‌ను రాకుండా చూస్తుంది.

కన్యా రాశి…

ఈ రాశి వారికి ఈ రోజు లాభ‌దాయ‌కంగా ఉంటుంది. స‌మాజంలో పేరున్న వ్య‌క్తుల నుంచి ప్రోత్సాహం అందుతుంది. ఆర్థిక స‌మ‌స్య‌ల వ‌ల్ల ప‌నులు ఆగిపోతాయి. వైవాహిక జీవితాన్ని ఆనందంగా గ‌డుపుతారు. సృజ‌నాత్మ‌క‌త క‌లిగి ఉంటారు.

ప‌రిహారం: పేద‌ల‌కు నూలు దుస్తులు, ఉప్పును దానం చేస్తే ఆర్థిక స‌మ‌స్య‌లు పోతాయి.

తులా రాశి…

ఆరోగ్యం ప‌ట్ల జాగ్ర‌త్త వ‌హించాలి. ర‌క్త‌పోటు ఉండేవారు జాగ్ర‌త్త‌గా ఉండాలి. ఆర్థిక స‌మ‌స్య‌లు వ‌స్తాయి. డ‌బ్బు అతిగా ఖ‌ర్చు చేస్తారు. మీ అశ్ర‌ద్ధ వ‌ల్ల న‌ష్టాలు క‌లుగుతాయి. సాయంత్రం శుభ‌వార్త వినే అవ‌కాశం ఉంటుంది. వైవాహిక జీవితం మెరుగు ప‌డే అవ‌కాశం ఉంది.

ప‌రిహారం: కుటుంబ స‌భ్యుల‌తో ప్రేమ‌గా, ఆప్యాయంగా ఉండాలి.

వృశ్చిక రాశి…

ఈ రోజు ఎంతో లాభ‌దాయ‌కంగా ఉంటుంది. దీర్ఘ‌కాల అనారోగ్య స‌మస్య నుంచి బ‌య‌ట ప‌డ‌తారు. పాత మిత్రులు ఆర్థిక స‌హాయం అడుగుతారు. ఉన్న స‌మ‌స్య‌ల‌ను మ‌రిచి కుటుంబంతో సంతోషంగా గ‌డుపుతారు.

ప‌రిహారం: పూజ‌గ‌దిలో ఆవు నెయ్యితో దీపారాధ‌న చేస్తే ఆర్థిక స‌మ‌స్య‌లు ఉండ‌వు.

ధనుస్సు రాశి…

ఈ రోజు బ్యాంకు ప‌నులు చేసే వారు జాగ్ర‌త్త‌గా ఉండాలి. ఇంట్లో ప‌నిచేసినా జాగ్ర‌త్త వ‌హించాలి. చుట్టాలు ఇంటికి వ‌చ్చేందుకు అవ‌కాశం ఉంది. ఉద్యోగం లేదా ప‌ని అవ‌కాశాలు ల‌భిస్తాయి. జీవిత భాగ‌స్వామికి అద‌నంగా స‌మ‌యం కేటాయిస్తారు.

ప‌రిహారం: మొక్క లేదా చెట్టు మొల‌క‌ల‌ను తెంచ‌రాదు.

మకర రాశి…

ఈ రోజు ఈ రాశి వారికి ఆర్థిక ప‌రిస్థితి బాగుంటుంది. బంధువులు బ‌హుమ‌తులు ఇస్తారు. మీ నైపుణ్యం మీకు గుర్తింపును తెచ్చి పెడుతుంది. అన్ని విధాలుగా లాభ‌దాయ‌కంగా ఉంటుంది. ఒత్తిడి ఎక్కువ‌వుతుంది.

ప‌రిహారం: గోధుమ రంగులో ఉండే ఆవులకు బెల్లం, రొట్టెలు తినిపిస్తే మంచిది.

కుంభ రాశి…

ఈ రోజు మీకు ధ‌నం ల‌భిస్తుంది. మ‌న‌స్సు ప్ర‌శాంతంగా మారుతుంది. కుటుంబంలోకి కొత్త వ్య‌క్తులు వ‌చ్చే అవ‌కాశం ఉంది. దాంతో వేడుక చేసుకుంటారు. స‌మ‌యం వృథా చేస్తారు. వైవాహిక జీవితం ఆనందంగా గ‌డుస్తుంది.

పరిహారం: రావి చెట్టుకు నీటిని పోయాలి. సాయంత్రం చెట్టు వ‌ద్ద దీపం వెలిగించాలి.

మీన రాశి…

ఆర్థికంగా లాభం క‌లిగే అవ‌కాశం ఉంది. ప్రేమించే వారితో బ‌హుమ‌తులు తీసుకోవ‌చ్చు. ప్రాజెక్టులు ఆల‌స్యం అయ్యే అవ‌కాశం ఉంది. ఆఫీసుల్లో ప‌నిచేసేవారు విచారానికి గుర‌య్యే అవ‌కాశం ఉంది. స‌మ‌యం వృథా అవుతుంది.

ప‌రిహారం: ఆవుల‌కు ఆకుపచ్చ చిరుధాన్యాలు తినిపిస్తే మంచిది.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here