
కొండాపూర్(నమస్తే శేరిలింగంపల్లి): కొండాపూర్ డివిజన్ టిఆర్ఎస్ పార్టీ రెబెల్ అభ్యర్థి గా మాజీ కార్పొరేటర్ నీలం రవీందర్ ముదిరాజ్ నామినేషన్ దాఖలు చేశారు. ఉమ్మడి శేరిలింగంపల్లి డివిజన్ కు కార్పొరేటర్ గా పని చేసిన ఆయన గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కొండాపూర్ డివిజన్ నుండి తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసి 8912 ఓట్లు సాధించి రెండవ స్థానం లో నిలిచారు. అనంతరం టిఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న ఆయన ఈ ఎన్నికల్లో పార్టీ టికెట్ పై ఆశలు పెట్టుకున్నారు. కాగా టిఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ కార్పొరేటర్లకే మరోసారి అవకాశం ఇవ్వడం తో నిరాశ చెందిన నీలం పార్టీ రెబెల్ అభ్యర్థి గా బరిలో దిగనున్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం టిఆర్ఎస్ అభ్యర్థి గా నామినేషన్ దాఖలు చేశారు. కొండాపూర్ డివిజన్ నుండి సిట్టింగ్ కార్పొరేటర్ హమీద్ పటేల్ కు టిఆర్ఎస్ అధిష్టానం టికెట్ కేటాయించిన విషయం తెలిసిందే.