కొనసాగుతున్న నేషనల్ హ్యాండీక్రాఫ్ట్స్ ఫెయిర్

  • ఆకట్టుకుంటున్న హస్తకళా ఉత్పత్తులు.. అలరిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు

నమస్తే శేరిలింగంపల్లి: శిల్పారామం  మాదాపూర్  లో  నిర్వహిస్తున్న నేషనల్ హ్యాండీక్రాఫ్ట్స్ ఫెయిర్  సందర్బంగా  విచ్చేసిన హస్తకళా ఉత్పత్తులు ఎంతగానో ఆకట్టుకుంటున్నవి. ఆర్టిఫికెయిలా జ్యువలరీ, ఇత్తడి విగ్రహాలు, రాగి విగ్రహాలు, చెక్కతో తయారు చేసిన విగ్రహాలు,  వెదురుతో తయారు చేసిన బుట్టలు, గంపలు, కుర్చీలు, అద్దకం చీరలు, డ్రెస్ మెటీరియల్స్, ఎన్నో మరెన్నో స్టాల్ల్స్ అందుబాటులో ఉన్నాయి. ఇందులో భాగంగా సాయంత్రం కూచిపూడి నృత్య ప్రదర్శనలో గురువు ఒగ్గు ప్రవీణ్ శిష్య బృందం కూచిపూడి నాట్యప్రదర్శన, ప్రముఖ కూచిపూడి నాట్య గురువు రాజనాల శ్రీదేవి కుమార్తె  నందిత లక్ష్మి శిష్య బృందం ప్రదర్శించిన నాట్య ప్రదర్శనలు ఎంతగానో అలరించాయి.

కూచిపూడి నృత్య ప్రదర్శనలో కళాకారులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here