ప్రతీ పట్టభద్రుడు ఎమ్మెల్సీ ఓటు హక్కు వినియోగించుకోవాలి: ప్రభుత్వ విప్ గాంధీ

సమావేశంలో మాట్లాడుతున్న ప్రభుత్వ విప్ గాంధీ

మియాపూర్(నమస్తే శేరిలింగంపల్లి): రంగారెడ్డి , హైదరాబాద్, మహబూబ్ నగర్ జిల్లాల ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల్లో ప్రతీ గ్రాడ్యుయేట్ ఓటు హక్కు వినియోగించుకోవాలని మేయర్ బొంతు రామ్మోహన్ పేర్కొన్నారు. బుధవారం మియాపూర్ విశ్వనాథ్ గార్డెన్ లో నిర్వహించిన ఓటు హక్కు అవగాహన కార్యక్రమానికి ఎమ్మెల్యే గాంధీ నగర మేయర్ బొంతు రామ్మోహన్ తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్స్ విషయంలో మంత్రి కేటీఆర్ ఓటరు నమోదు విషయమై దిశా నిర్దేశం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. అక్టోబర్ 1వ తేదీ నుంచి ప్రతి పట్టభద్రుడు ఎమ్మెల్సీ ఓటర్ గా నమోదు చేసుకునేలా, గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదునకు ప్రాధాన్యత ఇవ్వాలని పార్టీ వర్గాలకు సూచించారు. ఓటరు నమోదు కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టాలని, రానున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు అర్హత ఉన్న ప్రతి గ్రాడ్యుయేట్ ని ఓటరుగా నమోదు చేయించే బాధ్యత ప్రతీ కార్యకర్త తీసుకోవాలని సూచించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాజా ఓటర్ లిస్ట్ ఆధారంగానే జరుగుతాయని తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి అందుతున్న సంక్షేమ, అభివృద్ధి ఫలాలు ఖచ్చితంగా ఆయా కుటుంబాల్లోని గ్రాడ్యుయేట్లు గుర్తించేలా ముందుకు పోవాలి అన్నారు. ప్రతి కుటుంబానికి ఏదో ఒక విధంగా ప్రభుత్వం అందిస్తున్న పాలన ఫలాలు అందుతున్నాయని అన్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరినీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటరుగా నమోదు చేయాలని సూచించారు. ఓటరు నమోదు ప్రక్రియ తమ ఇళ్ల నుంచి ప్రారంభించాలని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా విజయం సాధిస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు , కౌన్సిలర్లు, డివిజన్ల అధ్యక్షులు, తెరాస నాయకులు తదితరులు పాల్గొన్నారు.

సమావేశానికి హాజరైన టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here