శేరిలింగంపల్లి, మార్చి 8 (నమస్తే శేరిలింగంపల్లి): ఐద్వా, సిఐటియు, ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పీజేఆర్ స్టేడియంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న చందానగర్ ఎస్సై సంధ్య అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ కేక్ కట్ చేసి జిహెచ్ఎంసి కార్మికులకు, ఎస్ఎఫ్ఐ నాయకులకు, మహిళా సంఘా నాయకులకు తినిపించారు. సంధ్య మాట్లాడుతూ అన్ని రంగాల్లో మహిళలు చైతన్యవంతులుగా భాగస్వాములు కావాలని, పితృస్వామ్య వ్యవస్థలో మహిళలు చేస్తున్న శ్రమను గుర్తించి స్త్రీలను గౌరవించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు చల్లా శోభన్ , కొంగరి కృష్ణ , మాణిక్యం, ఎస్ఎఫ్ఐ నాయకులు జార్జ్ కృప, ఫరియా, తైశ్య కార్మికులు అమృతమ్మ, లక్ష్మమ్మ, పోచమ్మ, నాగరాజు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.






