హఫీజ్‌పేట (నమస్తే శేరిలింగంపల్లి): వరద బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని హఫీజ్‌పేట డివిజన్ కార్పొరేటర్ వి.పూజిత జగదీశ్వర్ గౌడ్ అన్నారు. డివిజన్ పరిధిలోని జనప్రియ నగర్, ప్రజయ్ సిటీ, రామకృష్ణ నగర్ లలో ఇటీవల కురిసిన వర్షాలకు ముంపుకు గురైన బాధితులకు ఆమె రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేసిన రూ.10వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ముంపు ప్రాంతాల్లో ప్రజలు అధైర్య పడొద్దని, టీఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు.
డివిజన్ పరిధిలో అనేక చోట్ల కాలనీల్లో ఇళ్లు మునిగిపోయాయని, అందరినీ ఆదుకుంటామని తెలిపారు. వరద బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం ఇంటికి రూ.10వేల చొప్పున పంపిణీ చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో డీఈ రూపా దేవి, ఏఈ అనురాగ్, నాయకులు శాంతయ్య, బాలింగ్ గౌతమ్ గౌడ్, శేఖర్ రెడ్డి, వెంకట్ రెడ్డి, వాలా హరీష్ రావు, విష్ణు, వెంకటయ్య, నాయుడు, ఉమామహేశ్వర, జీహెచ్ఎంసీ అధికారులు నర్సింగ్ రావు, వర్క్ ఇన్‌స్పెక్టర్ సత్యనారాయణ పాల్గొన్నారు.