మానవ హక్కులపై అవగాహన సదస్సు

నమస్తే శేరిలింగంపల్లి: ప్రపంచ మానవ హక్కుల సంఘం జాతీయ చైర్మన్ సుబ్బారెడ్డి ఆదేశాల మేరకు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సూచనల మేరకు ఆదివారం రంగారెడ్డి జిల్లా వైస్ చైర్మన్ ప్రజాపతి సురేష్ కుమార్ ఆధ్వర్యంలో మానవ హక్కులపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మానవ హక్కుల సంఘంలో ఇటీవల చేరిన వారికి నియామపకపు పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో స్టేట్ చైర్మన్ తౌట్ రెడ్డి సంతోష్ రెడ్డి, వైస్ చైర్మన్ ఎలిమినేటి జంగారెడ్డి, డైరెక్టర్ కొండ సంతోష్ కుమార్, జనరల్ సెక్రటరీ రింకు గౌర్, స్టేట్ మహిళా వింగ్ చైర్ పర్సన్ బొమ్మిరెడ్డి సంధ్యారెడ్డి, వైస్ చైర్ పర్సన్ సమతా యాదవ్, జనగామ జిల్లా చైర్ పర్సన్ రేసు స్వప్న, శేరిలింగంపల్లి చైర్ పర్సన్ టి. కవిత రెడ్డి, మేడ్చల్ జిల్లా వైస్ చైర్ పర్సన్ ప్రభావతి యాదవ్, మేడిపల్లి మండల చైర్పర్సన్ మాధవి, మేడ్చల్ జిల్లా వైస్ చైర్మన్ ప్రమోద్ రెడ్డి, మేడ్చల్ జిల్లా వర్కింగ్ చైర్మన్ సంతోష్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

నియామకపు పత్రాలను అందజేస్తున్న సంతోష్ రెడ్డి

 

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here