నమస్తే శేరిలింగంపల్లి: హెచ్ఎండీఏ పరిధిలో బిల్డింగ్ నిర్మాణాలకు అనుమతులనిచ్చి నిర్మాణం పూర్తయిన భవనాలకు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ ఇప్పించాలని వెస్ట్ జోన్ బిల్టర్స్ అసోసియేషన్ సభ్యులు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ కి విజ్ఞప్తి చేశారు. హెచ్ఎండీఏ పరిధిలోని 15 శాతం ఏరియాను తాకట్టు పెట్టుకుని బిల్డింగ్ నిర్మాణాలకు అనుమతులనిచ్చి నిర్మాణాలు పూర్తయిన భవనాలకు సంవత్సరం గడుస్తున్నా నాలా సమస్యతో ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ ఇవ్వకపోవడంతో రెసిడెంట్స్, నిర్మాణదారులు తీవ్రఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. నాలా సమస్యతో హెచ్ఎండీఏ పరిధిలో స్థల యజమానులు నిర్మాణాలు చేసుకుందామంటే బిల్డింగ్ పర్మిషన్ నాలా సమస్య తో ఆగిపోయి ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. నిర్మాణాలు పూర్తయిన వాటికి ఆక్యుపెన్సీ సర్టిఫికెట్, నాలా సంబంధించిన చార్జీలు తీసుకొని ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ ఇప్పించాలని ప్రభుత్వ విప్ గాంధీకి వినతి పత్రం అందజేశారు. సానుకూలంగా స్పందించిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ ప్రభుత్వం దృష్టికి, సీఎస్ వద్దకు తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. వినతి పత్రం అందజేసిన వారిలో వెస్ట్ జోన్ బిల్డర్ అసోసియేషన్ అధ్యక్షుడు ముప్పా సుబ్బయ్య, జనరల్ సెక్రటరీ ప్రేమ్ కుమార్, ఉపాధ్యక్షుడు వి.రంగారావు, కెవి ప్రసాద్ రావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ సీహెచ్ రామ్ కుమార్, జాయింట్ సెక్రటరీలు రాజేంద్రప్రసాద్, సుభాష్ బాబు, కమిటీ మెంబర్ ధీరజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.