శేరిలింగంపల్లి, మార్చి 29 (నమస్తే శేరిలింగంపల్లి): కైదమ్మ కుంట చెరువు పునరుద్ధరణతో దశ దిశ మారుతుందని, చెరువును సుజల జలంతో అపురూప దృశ్య కావ్యంగా ఆవిష్కృతంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తామని PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ అన్నారు. హఫీజ్‌పేట్ డివిజన్ పరిధిలోని కైదమ్మ కుంట చెరువు సుందరీకరణలో భాగంగా Nexus select Malls కంపెనీ CSR ఫండ్స్ ద్వారా మల్లిగవాడ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్వచ్ఛందంగా చేపట్టనున్న చెరువు పునర్జీవనంలో భాగంగా సుందరీకరణ, పునరుద్ధరణ పనులను కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, సీనియర్ నాయకుడు బాలింగ్ గౌతమ్ గౌడ్ లతో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ పరిశీలించారు.
ఈ సందర్భంగా గౌరవ PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ కైదమ్మ కుంట చెరువు దశ దిశ మారుతుందని, కైదమ్మ కుంట చెరువు పునరుద్ధరణ ప్రభుత్వం, పరిశ్రమలు, సమాజం మధ్య భాగస్వామ్య ప్రయత్నాలు అర్ధవంతమైన పర్యావరణ పురోగతిని ఎలా నడిపించగలదో చెప్పడానికి ఒక శక్తివంతమైన ఉదాహరణగా నిలుస్తుందని అన్నారు. ఈ ప్రాజెక్ట్ కీలకమైన సహజ వనరులను పునరుజ్జీవింపజేయడమే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా భవిష్యత్తులో సుస్థిరమైన అభివృద్ధి కోసం ఒక నమూనాను ఏర్పాటు చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో CSR ఐటీ సంస్థ ప్రతినిధులు చైతన్య , రాము, నాయకులు బాలింగ్ గౌతమ్ గౌడ్, ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, వెంకటేష్ గౌడ్, మల్లేష్ గౌడ్ ,ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.