శేరిలింగంపల్లి, నవంబర్ 28 (నమస్తే శేరిలింగంపల్లి): హఫీజ్‌పేట్ డివిజన్ పరిధిలోని కైదమ్మ కుంట చెరువు సుందరీకరణలో భాగంగా Nexus select Malls కంపెనీ వారి CSR ఫండ్స్ ద్వారా మల్లిగవాడ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్వచ్ఛందంగా చేపట్టనున్న చెరువు పునరుజ్జీవనంలో భాగంగా సుందరీకరణ, పునరుద్ధరణ పనులను GHMC ఇంజనీరింగ్ విభాగం అధికారులతో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ కైదమ్మ కుంట చెరువులో మురుగు నీరు కలవకుండా ఇరిగేషన్ అధికారులు గతంలో UGD పైప్ లైన్ చేపట్టడం జరిగింది. ఈ పైప్ లైన్ సరిగ్గా పనులు చేపట్టక నిరుపయోగంగా దేనికి పనికి రాకుండాపోవడంతో ఔట్ లెట్ లో నీరు సక్రమంగా పోవడం లేదని ఇరిగేషన్ అధికారుల పనితీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కాలనీ వాసులు ఈ సమస్య ను గాంధీ దృష్టికి తీసుకువచ్చారు. త్వరలోనే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో GHMC AE ప్రతాప్, ఐటీ సంస్థ ప్రతినిధులు రామ్ బొట్ట, చైతన్య, నాయకులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, ప్రసాద్, MD ఇబ్రహీం తదితరులు పాల్గొన్నారు.