నమస్తే శేరిలింగంపల్లి: చెన్నూరు లిఫ్ట్ ఇరిగేషన్ వల్ల రైతులకు జరుగుతున్న ఇబ్బంది పై సోమవారం హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద ధర్నా చేసేందుకు బయలుదేరిన రైతుల బస్సులను అడ్డుకొని రైతులను పోలీసులు అరెస్ట్ చేయడం సరికాదని శేరిలింగంపల్లి నియోజకవర్గం బిజెపి నాయకులు ఉప్పల ఏకాంత్ గౌడ్, వివేకానంద నగర్ డివిజన్ కాంటెస్టెడ్ కార్పొరేటర్, మేడ్చల్ మల్కాజిగిరి మహిళా మోర్చా సెక్రెటరీ విద్యా కల్పనఏకాంత్ గౌడ్ పేర్కొన్నారు. అరెస్టులకు నిరసనగా మాజీ ఎంపీ, బిజెపి రాష్ట్ర నాయకులు వివేక్ వెంకటస్వామి చెన్నూరు రైతులకు మద్దతు తెలుపుతూ ఇందిరాపార్కు వద్ద చేసిన ధర్నాలో ఏకాంత్ గౌడ్, కల్పన, వివేకానందనగర్ డివిజన్ నాయకులు పాల్గొన్నారు. కార్యక్రమంలో సీనియర్ బిజెపి నాయకులు భాను యాదవ్, జిల్లా ఎస్సీ మోర్చా సెక్రటరీ అశోక్, డివిజన్ బిజెపి సెక్రటరీ దయాకర్ రెడ్డి, జితేందర్, ఎస్ సి మోర్చా ఉపాధ్యక్షులు యాకయ్య, ప్రధాన కార్యదర్శి ఉపేందర్, డివిజన్ బీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి రాజు గౌడ్,ఉపాధ్యక్షులు బొట్టు శీను, అరవింద్ యాదవ్, సోషల్ మీడియా ఇంచార్జ్ వినోద్, మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి మమత, ఉపాధ్యక్షురాలు మంజుల, శృతి గౌడ్, కార్యవర్గ సభ్యులు భారతి, శాలిని, తదితరులు పాల్గొన్నారు.