విశ్వామిత్ర యూత్ గ‌ణ‌నాథుడి ల‌డ్డు రూ.1.20 ల‌క్ష‌లు – ద‌క్కించుకున్న మ‌ణి, అశోక్‌

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: హ‌ఫీజ్‌పేట్ గ్రామంలోని విశ్వామిత్ర యూత్ వినాయ‌కుడి నిమ‌జ్జ‌న ప‌ర్వం ఘ‌నంగా ముగిసింది. న‌వ‌రాత్రులు పూజ‌లందుకున్న వినాయ‌కుడి ల‌డ్డును వేలం పాట వేయ‌గా భ‌క్తులు పెద్ద సంఖ్య‌లో పోటీప‌డ్డారు. చివ‌ర‌కు స్థానికులు మ‌ణి, అశోక్‌లో రూ.1.20 ల‌క్ష‌ల‌కు ల‌డ్డును కైవ‌సం చేసుకున్నారు. ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ వినాయ‌కుడి ల‌డ్డు ద‌క్కించుకోవ‌డం ఎంతో సంతోషంగా ఉంద‌ని, ఈ అవ‌కాశం క‌ల్పించిన విశ్వ‌మిత్ర యూత్ స‌భ్యుల‌కు ప్ర‌త్యేకంగా కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో యూత్ స‌భ్యులు విక్కు, నాగరాజ్‌, జ్ఞాని, రాహుల్‌, రాకేష్‌, రాజేష్‌, శ్రీను, శివ‌, మ‌హేష్‌, అనిల్‌, స్వామి త‌దిత‌రులు పాల్గొన్నారు.

మ‌ణి, అశోక్‌ల‌కు ల‌డ్డూను అంద‌జేస్తున్న విశ్వామిత్ర యూత్ స‌భ్యులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here