నమస్తే శేరిలింగంపల్లి: ఎల్‌బీనగర్‌లోని శ్రీకాంత్ చారి చౌక్ వద్ద కాంగ్రెస్ పార్టీ ఆద్వర్యంలో చేపట్టిన విద్యార్థి నిరుద్యోగ జంగ్ సైరన్ కార్యక్రమానికి శేరిలింగంపల్లి యువజన కాంగ్రెస్ నాయకులు తరలివెళ్లారు. యూత్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు శ్రీనివాస్, తెలంగాణ అధ్యక్షుడు శివసేన రెడ్డి, ఎన్ఎస్‌యూఐ అధ్యక్షుడు వెంకట్ బలుమూరులతో శేరిలింగంపల్లి యూత్ కాంగ్రెస్ నేతలు రాజన్, దుర్గం శ్రీహరి, దుర్గేష్‌లు దర్నాలో పాల్గొన్నారు.

అక్కడ లాఠీచార్జీ జరుగగా వారు ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. దళిత గిరిజన దండోరాల స్పూర్తితో ఇక విద్యార్థి, నిరుద్యోగ జంగ్ సైరన్ మోగిందని, ప్రభుత్వం మెడలు వంచడం ఖాయమని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి నిరుద్యోగుల, విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేనియెడిల తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్‌యూఐ నాయకులు పాల్గొన్నారు.
