వ‌ర‌ద బాధితులు అధైర్య ప‌డ‌కూడ‌దు

  • కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్

శేరిలింగంప‌ల్లి ‌ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తూ వరద ముంపు ప్రభావిత కుటుంబాలు, వరదల వల్ల నష్టపోయి ఇబ్బందులు పడుతున్న బాధిత కుటుంబాలు అధైర్యపడవద్దని, మీకు మేమున్నామంటూ శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ భరోసా కల్పించారు. వర్షం కారణంగా గోపీనగర్ లోని గోపిచెరువు సమీపంలో ఉన్న లోతట్టు ప్రాంతాల ఇళ్లల్లోకి వరద నీరు వచ్చి చేరడంతో నష్టపోయిన ముంపు బాధితులకు తక్షణ సాయం కింద ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రకటించిన రూ. 10 వేల నగదును కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ బుధవారం 15 మంది బాధిత కుటుంబాలకు రూ. 10 వేల చొప్పున ఇంటింటికి తిరుగుతూ అందజేశారు.

వ‌ర‌ద బాధితుల‌కు రూ.10వేల ఆర్థిక స‌హాయం అంద‌జేస్తున్న కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్

ముంపు బాధితులు అధైర్యపడకూడదని, వారికి ఎప్పటికప్పుడు తక్షణ సహాయ చర్యలు అందజేయడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ముందుంటుందని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అనుక్షణం తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా టీఆర్ఎస్ ప్రభుత్వం బాసటగా నిలుస్తోందని కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పేర్కొన్నారు. ఆయన వెంట ఏఈ సునిల్, ట్యాక్స్ ఇన్ స్పెక్టర్ రామకృష్ణారెడ్డి, బిల్లు కలెక్టర్ రాము, టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు రాజు యాదవ్, ప్రధాన కార్యదర్శి రవీందర్ గౌడ్, గోపీనగర్ బస్తీ కమిటీ ఆధ్యక్షుడు గోపాల్, నాయకులు మల్కయ్య, ఆంజనేయులు, సైదులు, నాగరాజు ఉన్నారు.

వ‌ర‌ద బాధితుల‌కు రూ.10వేల ఆర్థిక స‌హాయం అంద‌జేస్తున్న కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here