శేరిలింగంపల్లి, జనవరి 11 (నమస్తే శేరిలింగంపల్లి): సిపిఐ రాష్ట్ర కంట్రోల్ కమిషన్ నాయకుడు వీర్ల ప్రకాష్ కి బీసీ కులాల ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బేరి రాంచందర్ యాదవ్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బేరి మాట్లాడుతూ కార్మికులకు ,కష్టజీవులకు అండగా నిలిచిన నాయకుడు వీర్ల ప్రకాష్ అని, నిత్యం కార్మికుల హక్కులకు పోరాటం చేసిన గొప్ప నాయకుడు అని కొనియాడారు. ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో జీవించాలని భగవంతుడిని వేడుకుంటున్నట్లు తెలిపారు. బడుగు బలహీన వర్గాల కోసం పోరాటాలు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ నాయకులు పాములేటి యాదవ్, శ్రీనివాస్ యాదవ్, బేరి చంద్రశేఖర్ యాదవ్, బీసీ నాయకులు పాల్గొన్నారు.






