నమస్తే శేరిలింగంపల్లి: వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం వార్షికోత్సవ కార్యక్రమాలు ఈ నెల 11నుంచి 17 వరకు MCPI(U) రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న విషయం విధితమే. ఈ నేపథ్యంలో ఆదివారం గ్రేటర్ హైదరాబాద్ మియాపూర్ ప్రాంతంలోని స్టాలిన్ నగర్ లో ప్రారంభమయ్యాయి.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా MCPI(U) రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ గాధగోని రవి పాల్గొని మాట్లాడుతూ.. నాటి నిజాం పాలనపై కొనసాగిన వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట స్ఫూర్తితో నేటి మతోన్మాద నియంతృత్వ పాలనపై ప్రజా సమీకరణ పోరాటాలు చేయాలని అన్నారు. నాడు భూమి కోసం భుక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం కామ్రేడ్ భీమిరెడ్డి నరసింహారెడ్డి ,రావి నారాయణరెడ్డి, మద్దికాయల ఓంకార్, దేవులపల్లి వెంకటేశ్వరరావు, మల్లు స్వరాజ్యం, మద్దికాయల లక్ష్మక్క లాంటి అనేక యోదాను యోధుల నేతృత్వంలో కొనసాగిన ప్రజా సమీకరణ పోరాటం నాటి భారత స్వాతంత్ర్య ఉద్యమానికి ఊపిరినిచ్చిందని, అలాగే ఈ రైతాంగ సాయుధ పోరాటాన్ని యావత్ ప్రపంచం గర్వించిందని కొనియాడారు. నాడు నిజాం నవాబులతోపాటు భూస్వాములను జాగిర్ధార్ లను జమీందారులను, రజాకార్ల ను ఒడిశెల రాళ్ళతో గుతుపల సంఘాలతో, వాలంటీర్ దళాలతో తుపాకులను చేతపట్టించి దొరల మెడలు వంచి పది లక్షల వ్యవసాయ సాగు భూమిని పేద ప్రజలకు పంచిన చరిత్ర, 3000 గ్రామాలను స్వరాజ్య గ్రామాలుగా పరిపాలించుకున్న చరిత్ర ఈ తెలంగాణ గడ్డపై కమ్యూనిస్టులది ఎర్రజెండదేనని అన్నారు. 4000 మంది అటు నైజాం సైన్యాలతో ఇటు నెహ్రూ పటేల్ సైన్యాలతో ఎదురొడ్డి పోరాడి అమరత్వం పొందారని అంతటి చరిత్ర గల వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి నేడు హిందూ ముస్లిం అనే మతరంగును పులుముతూ తెలంగాణ గడ్డమీద మతోన్మాద చర్యలను కొనసాగించడానికి కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఒడిగట్టిందని ఆరోపించారు. రాష్ట్రంలోని టిఆర్ఎస్ ప్రభుత్వానికి 8 సంవత్సరాలు అధికారం తెలంగాణ ప్రజలు ఇచ్చినప్పటికీ ఏనాడు నాటి తెలంగాణ సాయుధ పోరాట అంశాలను వాస్తవాలను ప్రజలకు వివరించలేదని, నేడు తమ రాజకీయ ప్రయోజనాల కోసం నాటి తెలంగాణ పోరాటాన్ని వక్రీకరించి రాజకీయ సొమ్ము చేసుకోవడానికి పూనుకుందని ఆరోపించారు. కేంద్రంలోని బిజెపి రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రభుత్వాలు దొందు, దొందుగా వ్యవహరిస్తూ సెప్టెంబర్ 17 న వీరేదో ఘనకార్యం చేసినట్టు ప్రజల ముందు చరిత్రను వక్రీకరించే కార్యక్రమాన్ని తీసుకున్నారని, ఇది ముమ్మాటికీ ఈ పాలకవర్గాల తప్పుడు విధానమని తప్పుపట్టారు. నాటి వీర తెలంగాణ పోరాట వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న తెలంగాణ ప్రజలు మతోత్మాద నియంతృత్వ పాలనతో కొనసాగుతున్న బిజెపి, టిఆర్ఎస్ విధానాలను తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 17న వార్షికోత్సవ ముగింపు సభను హైదరాబాద్ బాగ్ లింగంపల్లి లోని ఓంకార్ భవన్ , బి ఎన్ హాల్లో రాష్ట్రవ్యాపిత ప్రజా సమీకరణతో ఘనంగా నిర్వహిస్తున్నామని ప్రజలు ప్రజాతంత్ర వాదులు మతోన్మాద, నియంతృత్వ పాలనను వ్యతిరేకించే ప్రతి పౌరులు హాజరై విజవంతం చేయాలని పిలుపునిచ్చారు. UPNM రాష్ట్ర అధ్యక్షులు కా,,మైదం శెట్టి రమేష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో MCPI(U) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వనం సుధాకర్ , గ్రేటర్ హైదరాబాద్ కార్యదర్శి వి .తుకారాం నాయక్, AICTU రాష్ట్ర అధ్యక్షులు తుడుం అనిల్ కుమార్, AIFDS రాష్ట్ర అధ్యక్షులు పల్లె మురళి, యంసిపిఐయు గ్రేటర్ హైదరాబాద్ నాయకులు ఈ. దశరథ్ నాయక్, AIFDY గ్రేటర్ హైదరాబాద్ కన్వీనర్ డి. మధుసూదన్ , ఎండి సుల్తానా బేగం, డి శ్రీనివాసులు, AICTU గ్రేటర్ హైదరాబాద్ నాయకులు కర్ర దానయ్య రాములు,UPNM నాయకులు డి లక్ష్మి, ఎన్ గణేష్ ఎన్ నాగభూషణం, లక్ష్మీ నరసింహ శంకర్ అంజయ్య శివాని అమీనా బేగం. రాధా, మాధవ, శంకర్ చంద్రమోహన్ రెడ్డి దస్తప్ప రతన్ నాయక్ పాల్గొన్నారు.