నమస్తే శేరిలింగంపల్లి: మియాపూర్ డివిజన్ పరిధిలోని ప్రతి కాలనీలలో మంచినీటి సమస్య, రోడ్లు డ్రైనేజి సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామని స్థానిక కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ అన్నారు. మియపూర్ డివిజన్ పరిధిలోని న్యూ కాలనీ లో నూతనంగా నిర్మిస్తున్నటువంటి యూజీడీ పైపులైన్, మురికినీటి కాలువ పనులను జీహెచ్ఎంసీ అధికారులతో కలసి కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో వర్క్ ఇన్‌స్పెక్టర్ విశ్వనాధ్, ప్రేమ్, జగదీష్, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.