శేరిలింగంపల్లి, మార్చి 31 (నమస్తే శేరిలింగంపల్లి): దీప్తి శ్రీ నగర్ లోని శ్రీ ధర్మపురి క్షేత్రంలో శ్రీ విశ్వవసు నామ సంవత్సర తెలుగు సంవత్సరాదిని పురస్కరించుకొని శ్రీ ధర్మపురి పక్షాన అచల యోగిని గురు మాత జి నారాయణమ్మ (G.H.MC) ఉద్యోగికి, వాస్తు శాస్త్రజ్ఞుడు డాక్టర్ రామకృష్ణకి కెవి రావు దైవాధీనం చేతుల మీదుగా ఉగాది పురస్కారాలను అందజేశారు. మ్యాజిక్ చాంప్లిన్ చొక్కాకు వెంకట్రావు తన మ్యాజిక్ షో తో భక్తులందరినీ ఆనందపరిచారు. శింగారమణి కనక విజయలక్ష్మి దామెర్లచే నవరసాల దైవ విలాసం నృత్య రూపకం జరిగింది. వేద స్వస్తి పేద పారాయణం ఆలయ అర్చకుడు వెంకటేష్ శర్మ, పంచాంగ శ్రవణం విశ్వేశ్వర శర్మ చేశారు. అనంతరం బ్రహ్మాది దేవతల పల్లకి సేవ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని తిలకించడానికి అనేకమంది భక్తులు వచ్చి శ్రీ ధర్మపురి క్షేత్ర దేవి దేవతల ఆశీస్సులను పొందారు. ఈ కార్యక్రమం అంతా ఆలయ వ్యవస్థాపకురాలు భారతీయ సత్యవాణి చేతుల మీదుగా నిర్వహించారు.