టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ ఏర్పాట్లపై పలు సూచనలిచ్చిన కమిటీ సభ్యులు

నమస్తే శేరిలింగంపల్లి: టీఆర్ఎస్ పార్టీ ద్వి దశాబ్ది వేడుకల్లో భాగంగా హైటెక్స్ లో ఈ నెల 25న నిర్వహించే పార్టీ ప్లీనరీ సమావేశం ఏర్పాట్లను, సభా వేదిక , వాహనాల పార్కింగ్ తదితర ఏర్పాట్లను బుధవారం ఎమ్మెల్సీలు భాను ప్రసాద్, కర్నెప్రభాకర్, టీసీసీ ఛైర్మెన్ గ్యాదరి బాలమల్లు, పౌర సరఫరాల ఛైర్మెన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, మాదవరం కృష్ణా రావు, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి‌ గాంధీ, మాజీ మేయర్ బొంతు రాం మోహన్, కార్పొరేటర్లు జగదీశ్వర్ గౌడ్, రాగం నాగేందర్ యాదవ్, ఉప్పలపాటి శ్రీకాంత్, మాజీ కార్పొరేటర్ రంగరావు పరిశీలించారు. ప్లీనరీ సమావేశానికి వచ్చే ప్రజా ప్రతినిధుల కోసం చేస్తున్న ఏర్పాట్లు, సభవేదిక, పార్కింగ్ ఏర్పాట్లు పనులు ముమ్మరం చేసినట్లు ప్రభుత్వ విప్ గాంధీ తెలిపారు. సమావేశానికి వచ్చే ప్రజాప్రతినిధులకు, సామాన్య ప్రజానీకానికి ట్రాఫిక్ సమస్య లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. త్వరితగతిన ఏర్పాట్లు పూర్తి కావాలని, మరిన్ని ఏర్పాట్లపై పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మాదాపూర్ డివిజన్ అధ్యక్షుడు శ్రీనివాస్ యాదవ్ ,హఫీజ్ పెట్ డివిజన్ అధ్యక్షుడు గౌతమ్ గౌడ్, టీఆర్ఎస్ నాయకులు వాలా హరీష్, సాంబశివరావు, చలపతి, ప్రసాద్, లక్ష్మారెడ్డి, రాంచందర్, గౌస్, లోకేష్, సంతోష్, కంది జ్ఞానేశ్వర్, అనిల్ కావూరి తదితరులు పాల్గొన్నారు.

టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ సమావేశం ఏర్పాట్లను పరిశీలిస్తున్న‌ ఆయా కమిటీ సభ్యులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here