కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను యావత్ ప్రజానీకం ఖండిస్తుంది: ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణ రాష్ట్రం రైతాంగం పట్ల బిజెపి కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజానీకం ఖండిస్తుందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. కేంద్ర ప్రభుత్బ వైఖరికి నిరసనగా, తెలంగాణ యాసంగి వడ్లు ఒక్క కిలో కూడా తీసుకోమని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పార్లమెంట్ సాక్షిగా తేల్చిచెప్పినందుకు నిరసనగా సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు అల్విన్ ఎక్స్ రోడ్డు జాతీయ రహదారిలో కార్లొరేటర్లు, టీఆర్ఎస్ నాయకులతో కలిసి ప్రభుత్వ విప్ గాంధీ నిరనస చేపట్టారు. నల్ల బ్యాడ్జీలు ధరించి చావు డప్పుతో నరేంద్ర మోడీ శవయాత్ర‌ నిర్వహించి దిష్టిబొమ్మను దగ్దం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ రైతు వ్యతిరేక విధానాలను అనుసరిస్తూ ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం వ్యవహరిస్తున్న మొండి వైఖరికి వ్యతిరేకంగా నిరసన చేపడుతున్నట్లు చెప్పారు. రైతులను నిలువునా ముంచే సాగు చట్టాల విషయంలో డిల్లీలో నిరసన కార్యక్రమాలు చేపట్టిన రైతులను ముప్పు తిప్పలు పెట్టారని, చాలా మంది రైతులు అసువులు బాసారని, చివరకు న్యాయమే గెలిచి రైతుల పట్టుదల ముందు కేంద్రం ఓడిపోయిందని అన్నారు. రైతులకు న్యాయం జరిగే వరకూ టిఆర్ఎస్ పార్టీ రైతుల తరపున పోరాడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు పూజిత గౌడ్, జగదీశ్వర్ గౌడ్, నాయకులు నల్లా సంజీవ రెడ్డి, బాలింగ్ యాదగిరి గౌడ్, కృష్ణ ముదిరాజ్, మాదాపూర్ డివిజన్ టిఆర్ఎస్ పార్టీ గౌరవ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, హఫీజ్ పెట్ డివిజన్ టిఆర్ఎస్ పార్టీ అద్యక్షులు బాలింగ్ గౌతమ్ గౌడ్, మాదాపూర్ డివిజన్ టిఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ సాంబశివ రావు, లక్ష్మారెడ్డి, హఫీజ్ పెట్ డివిజన్ గౌరవ అధ్యక్షులు వాలా హరీష్ రావు, శాంతయ్య, మాదాపూర్ డివిజన్ బీసీ సెల్ అధ్యక్షులు బిక్షపతి ముదిరాజ్, ఉపాధ్యక్షులు మధుసూదన్ రెడ్డి, హఫీజ్ పెట్ డివిజన్ బీసీ సెల్ అధ్యక్షులు నరేందర్ గౌడ్, వార్డ్ సభ్యులు కనకమామిడి వెంకటేష్ గౌడ్, శేఖర్ ముదిరాజ్, రామచందర్, హాఫీజ్ పెట్ డివిజన్ ఎస్సీ సెల్ అధ్యక్షులు కంది ఙ్ఞానేశ్వర్, మాదాపూర్ డివిజన్ ఎస్సీ సెల్ అధ్యక్షులు ఓ.కృష్ణ, ఖానమేట్ బస్తీ అధ్యక్షులు సర్వార్, మాతృశ్రీ నగర్ కాలనీ అధ్యక్షులు అనిల్ కుమార్ కావూరి, గోకుల్ ప్లాట్స్ కాలనీ అధ్యక్షులు బి.శ్రీనివాస్, హఫీజ్ పెట్ డివిజన్ మైనారిటీ అధ్యక్షులు సయ్యద్ సాదిక్ హుస్సేన్, గంగారాం టిఆర్ఎస్ బస్తి అధ్యక్షులు దేవరాజ్, గంగారాం ఎస్సి సెల్ అధ్యక్షులు కంది అనిల్, సుభాష్ చంద్ర బోస్ నగర్ బస్తి అధ్యక్షులు ముక్తర్, కృష్ణ కాలనీ బస్తి అధ్యక్షులు కృష్ణ యాదవ్, ఖాసీం, బాబూమియా, సలీం, గౌస్, నూరుద్దీన్, జఫ్ఫార్, సాదిక్, డాక్టర్ ప్రసాద్, సెల్వరాజ్, హనీఫ్, లాలూ పటేల్, పాషా, రవి కుమార్, శేఖర్ గౌడ్, రామకృష్ణ గౌడ్, సయ్యద్ సత్తార్ హుస్సేన్, చంద్ పాషా, సయ్యద్ సాబేర్, జామీర్, సాంగ రెడ్డి, కృష్ణ నాయక్,‌ సంజు, రాందాస్, రామాంజనేయులు, యాదగిరి ముదిరాజ్, శ్రీనివాస్ గౌడ్, అంకారావు, బాబుమోహన్ మల్లేష్, ఉమామహేశ్వరరావు, మల్లికార్జున్, రవి, జనార్దన్ గౌడ్, అశోక్, సాంబయ్య, రాజేందర్, దొంతి గోపి, వీరెందర్, నందు, నాయుడు, పద్మా రావు, షైక్ ఖాజా, దిలీప్, సుబ్రమణ్యం, శ్రీనివాస్ నాయక్, శ్యామ్ నాయక్, సుదేశ్, జైపాల్, రాజు యాదవ్, సాయి, మహమ్మద్, మనోజ్, సర్దార్, అలీం, బుజ్జమ్మ, షబాన, పద్మ, మొగులమ్మ, శశిరేఖ, శ్రీజ రెడ్డి, ఆశ, కతున్ భీ తదితరులు పాల్గొన్నారు.

ఆల్విన్ ఎక్స్ రోడ్డులో కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మను దగ్దం చేసి నిరసన తెలుపుతున్న ప్రభుత్వ విప్ గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here