శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 17 (నమస్తే శేరిలింగంపల్లి): ఉత్తరప్రదేశ్ లక్నోలో జరిగిన అఖిలభారత ఉపాధ్యాయుల సమాఖ్య సమావేశంలో రాష్ట్ర పీఆర్‌టీ అధ్యక్షుడు చెన్నయ్యను సన్మానించారు. ఈ సందర్భంగా అఖిల భారత నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఉపాధ్యక్షుడిగా ఆయన ఎన్నికయ్యారు. శేర్లింగంపల్లి శివాజీ నగర్ లో నివాసం ఉంటున్న ఉపాధ్యాయుడు చెన్నయ్యకి మాజీ ప్రెసిడెంట్ ఎస్ఎన్ రెడ్డి అభినందనలు తెలియజేశారు. ఆయన ఇంకా ఎన్నో ఉన్నత పదవులు చేపట్టాలని కోరుతున్నట్లు తెలిపారు.