- తల్లీ బిడ్డా క్షేమం… వైద్యులకు కృతజ్ఞతలు తెలిపిన కుటుంబసభ్యులు
నమస్తే శేరిలింగంపల్లి: స్టేజ్ 3 రొమ్ము క్యాన్సర్‌తో బాధపడుతున్న 12 వారాల గర్భిణీకి విజయవంతంగా చికిత్స అందించి తల్లి బిడ్డ ప్రాణాలను కాపాడారు మెడికవర్ కాన్సర్ ఇన్స్టిట్యూట్ వైద్యులు. వివరాలు.. సోమాలియాకు చెందిన ఫదుమో మొహమ్మద్ ఒమర్(33) 17వ తేదీ వచ్చేసరికి వరకు 12 వారాల గర్భవతి, ఆ సమయంలో స్టేజ్ 3 రొమ్ము క్యాన్సర్ ఉన్నట్లు వైద్యులు చెప్పటంతో కొంత ఆందోళనకు గురైంది. క్యాన్సర్ థెరపీతో, తల్లి, బిడ్డకు అధిక ప్రమాదమని వారు అనటంతో ఆమె మదిలో మరిన్ని ప్రశ్నలు మొదలయ్యాయి. క్యాన్సర్ చికిత్స చేపించుకోకపోతే తనకి, చేయించుకుంటే కడుపులో ఉన్న బాబుకి ప్రమాదమని అర్థం చేసుకున్నది, వెంటనే ఆమె తనకు తెలిసిన వాళ్ళ ద్వారా అత్యుత్తమ వైద్యం అందించే హాస్పిటల్స్ గురించి తెలుసుకున్నది. మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ అయితేనే తన వ్యాధిని నయం చేయగలదని భావించి ఆ దవాఖానకు చెందిన మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ సాద్విక్ రఘురాంను సంప్రదించారు. అక్కడ ఆయన ఆమె పరిస్థితిని అర్ధం చేసుకొని ఆమెకు దైర్యం చెప్పి చికిత్స మొదలు పెట్టారు. రొమ్ము క్యాన్సర్‌తో బాధపడుతున్న గర్భిణీని ఆమె పుట్టబోయే బిడ్డను రక్షించడానికి మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఈ ఛాలెంజ్‌ని తీసుకున్నది. మహిళకు కీమోథెరపీ చికిత్స అందించి విజయవంతంగా పూర్తి చేశారు. ఆమె ఆరోగ్యకరమైన మగబిడ్డకు జన్మనిచ్చింది. డాక్టర్ సాద్విక్ రఘురాం మాట్లాడుతూ ఒకవేళ ఆమె నిర్లక్ష్యం చేసిఉంటే “క్యాన్సర్ శరీరమంతా వ్యాపించి చివరికి తల్లీ బిడ్డల మరణానికి దారితీసేది” అని అన్నారు. తల్లితో పాటు బిడ్డని నిరంతరం పర్యవేక్షిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవడం వలన ఇద్దరి ప్రాణాలను కాపాడగలిగామన్నారు. అత్యంత క్లిష్టమైన ఆరోగ్య పరిస్థితి నుండి తల్లి, బిడ్డను రక్షించినందుకు డాక్టర్ సాద్విక్ రఘురాంకు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.