సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేస్తూ పార్టీని బలోపేతం చేయాలి: చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు కొండా విశ్వేశ్వర్ రెడ్డి

శేరిలింగంప‌ల్లి, జ‌న‌వ‌రి 19 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): పార్టీ ఆదేశాల మేరకు పనిచేస్తూ రాబోయే రోజుల్లో ఏ ఎన్నికలు జరిగినా భారతీయ జనతా పార్టీ గెలుపుకోసం కృషి చేస్తూ, అధికారంలోకి తీసుకురావడం కోసం కీలక పాత్ర పోషించాల‌ని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు శేరిలింగంపల్లి అసెంబ్లీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే, ఇంఛార్జి రవికుమార్ యాదవ్ అన్నారు. బంజారాహిల్స్ లోని చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు కొండా విశ్వేశ్వర్ రెడ్డి కార్యాలయంలో మియాపూర్ , మాదాపూర్ , కొండాపూర్ డివిజన్ల లోని పలువురు తెలుగుదేశం పార్టీ నుండి నల్లూరి పట్టాభి రామ్, కనికంటి ప్రభాకర్ రావు ,అంకమ్మ చౌదరి, బ్రహ్మ, వెంకటేష్, శ్రీకాంత్, ప్రభాకర్ రెడ్డి ,సాగర్, నరసింహ మొదలగు వారు భారతీయ జనతా పార్టీలో చేరారు. వారికి చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, రవికుమార్ యాదవ్ లు కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

పార్టీలో చేరిన వారికి కండువాలు క‌ప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్న ఎంపీ కొండా విశ్వేశ్వ‌ర్ రెడ్డి, ర‌వికుమార్ యాద‌వ్

అనంతరం వారు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీలో చేరిన వారికి అభినందనలు తెలియజేశారు. పార్టీ ఆదేశాల మేరకు సిద్ధాంతాలకు కట్టుబడి, నిబద్ధతతో పనిచేసి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు. రాబోయే రోజుల్లో ఏ ఎన్నికలు జరిగినా పార్టీ గెలుపుకోసం కృషి చేస్తూ, అధికారంలోకి తీసుకురావడానికి పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాదాపూర్ కంటెస్టెడ్ కార్పొరేటర్ రాధాకృష్ణ యాదవ్, లింగంపల్లి కంటెస్టెడ్ కార్పొరేటర్ ఎల్లేశ్, డివిజన్ అధ్యక్షులు ఆకుల లక్ష్మణ్, జితేందర్, వంశీ రెడ్డి, సీనియర్ నాయకులు మాణిక్ రావు, రెడ్య నాయక్,శివ, రవీందర్ ,రత్నం, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here