శేరిలింగంపల్లి, జనవరి 19 (నమస్తే శేరిలింగంపల్లి): తెలుగు వెలుగు సాహిత్య వేదిక జాతీయ ప్రధాన కార్యదర్శి కవి, జర్నలిస్టు డాక్టర్ మోటూరి నారాయణ రావు తెలుగు కీర్తి పురస్కారానికి ఎంపికయ్యారు. ఈ మేరకు శ్రీ శ్రీ కళా వేదిక జాతీయ ఛైర్మన్, ప్రపంచ తెలుగు సాహిత్య , సాంస్కృతిక అకాడమీ ఛైర్మన్ డాక్టర్ కత్తిమండ ప్రతాప్, ఆ సంస్థ జాతీయ అధ్యక్షురాలు కొల్లు రమావతి ఒక ప్రకటనలో తెలిపారు . తెలుగు భాషా , సంస్కృతి, తెలుగు వైభవం , తెలుగు సాహిత్యం, తెలుగు కళల పరిరక్షణ కోసం నిరంతరాయంగా పనిచేస్తూ.. సాహిత్య, సామాజిక సేవా ప్రభంజనం సృష్టిస్తున్న శ్రీ శ్రీ కళా వేదిక, తెలుగు అసోసియేషన్ ఆఫ్ నేషనల్ అకాడమీ,బుక్ ఆఫ్ రికార్డ్స్ , వరల్డ్ రైటర్స్ ఫోరం, వరల్డ్ పోయెట్రీ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో ఈనెల 21 వ తేదీన విజయవాడలోని శ్రీ కౌత పూర్ణానంద్ విలాస్ కళా వేదికపై జరిగే జాతీయ సమావేశంలో తెలుగు కీర్తి పురస్కారం అందుకోనుండటంపై కవి మోటూరి నారాయణ రావు హర్షం వ్యక్తం చేశారు. ప్రతిష్టాత్మకమైన తెలుగు కీర్తి ప్రతిభా పురస్కారానికి ఎంపిక చేసిన శ్రీ శ్రీ కళా వేదిక జాతీయ ఛైర్మన్, ప్రపంచ తెలుగు సాహిత్య , సాంస్కృతిక అకాడమీ ఛైర్మన్ డాక్టర్ కత్తిమండ ప్రతాప్,ఆ సంస్థ జాతీయ అధ్యక్షురాలు కొల్లు రమావతి లకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.
