శేరిలింగంపల్లి, జనవరి 19 (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్‌లోని హనుమాన్ ఆలయ ప్రాంగణం నుంచి అపర్ణ హిల్స్ వయా గంగారం పెద్ద చెరువు కట్ట వరకు నిర్మించనున్న రోడ్డు ప్రతిపాదనకు తాము వ్యతిరేకమని ఆలయ కమిటీ నాయకులు డివిజన్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డికి వినతిపత్రం సమర్పించారు. ఈ రహదారి కారణంగా ఆలయ క్వార్టర్స్ దెబ్బ తింటాయని అన్నారు. గతంలోనూ జాతీయ రహదారి రోడ్డు విస్తరణను తాము వ్యతిరేకించి ఆలయాన్ని రక్షించామని, ఇప్పుడు కూడా రహదారి నిర్మాణ ప్రతిపాదనకు తాము వ్యతిరేకమని, రహదారి నిర్మాణ పనులు చేపట్టకూడదని కోరారు. ఈ మేరకు ఆలయ కమిటీ అధ్యక్షుడు ఎం.రాధాకృష్ణాగౌడ్ ఒక ప్రకటనలో తెలిపారు.
