శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 19 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని కూకట్ పల్లి వివేకానంద నగర్ డివిజన్ VNR బాంకెట్ హాల్ అయ్యప్ప స్వామి ఆలయ ప్రాంగణంలో మిత్ర టీం కూకట్ పల్లి మండల్ ఆధ్వర్యంలో టీచర్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వడ్డేపల్లి రాజేశ్వరరావు , సురభి రవీందర్ రావు, జిల్లా ఉపాధ్యక్షురాలు స్రవంతిలతో కలిసి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, కాంటెస్టెడ్ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇన్చార్జి రవి కుమార్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కూకట్‌పల్లి పరిసర ప్రాంతాల ప్రయివేట్ పాఠశాలల కరస్పాండెంట్స్, టీచర్స్ ను రవి కుమార్ యాదవ్ సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ క్రమశిక్షణను, ఆత్మవిశ్వాసాన్ని ఉపాధ్యాయులు నేర్పిస్తారని, తల్లిదండ్రులను, విద్య నేర్పిన గురువులను జీవితంలో ఎప్పటికీ మర్చిపోకూడదని అన్నారు. విద్య నేర్పే గురువులు లేకపోతే మన జీవితం శూన్యమని, వారు నేర్పిన చదువు వల్లనే ఈరోజు మనమంతా ఈ స్థాయిలో ఉన్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మిత్ర మండలి సభ్యులు రవీందర్ రావు, అశోక్ , నరేందర్, మల్లేష్ , శ్రీశైలం, ఇంద్రసేనారెడ్డి, నాగరాజు, రమణ, వెంకటస్వామి, విష్ణువర్ధన్ రెడ్డి, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.






