కామ్రేడ్ తాండ్ర కుమార్ విగ్రహ ఆవిష్కరణ

నమస్తే శేరిలింగంపల్లి: మాదాపూర్   ప్రధాన కూడలి వద్ద ఆదివారం కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కామ్రేడ్ తాండ్ర కుమార్ విగ్రహాన్ని స్థానిక శాసనసభ సభ్యులు అరికపూడి గాంధీ ఆవిష్కరించారు.

మియాపూర్ ప్రధాన కూడలి వద్ద ఆదివారం కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కామ్రేడ్ తాండ్ర కుమార్ విగ్రహాన్ని ఆవిష్కరించిన స్థానిక శాసనసభ సభ్యులు అరికపూడి గాంధీ.

ముఖ్య అతిథిగా ఎం సి పి ఐ (యు) పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ గాదగోని రవి శిలాఫలకాన్ని ప్రారంభించారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ కామ్రేడ్ తాండ్ర కుమార్ బడుగు బలహీన వర్గాల ప్రజల అభివృద్ధికి నిరంతరం పనిచేస్తూ వివిధ జిల్లాల నుండి పట్టణాలకు పొట్ట చేత పట్టుకుని వచ్చిన తాడిత పీడిత ప్రజలకు అందర్నీ సమూహం చేసి వారికి నివసించడానికి కనీస ఇల్లు కావాలని వారి తరపున ఎర్రజెండా పట్టుకున్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ప్రభుత్వ భూములను పేదవారికి పంచిన ఉద్యమంలో ఎన్ని ఇబ్బందులు ఎదురైన ఎన్ని కేసులు పెట్టిన రాజీలేని పోరాటం చేసి పేద ప్రజల కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన మహనీయుడు గొప్ప త్యాగశీలి ఆయన. యావత్ కమ్యూనిస్టు ఉద్యమాన్ని నిలబెట్టడంలో తన చేసిన కృషి చాలా గొప్పదని ఈ సందర్భంగా కొనియాడారు. కార్యక్రమంలో తాండ్ర కుమార్ తనయుడు తాండ్ర రమేష్ , మనవడు తాండ్ర రోహన్ , కుటుంబ సభ్యులు తాండ్ర వెంకటేష్ గౌడ్, తాండ్ర రాజు గౌడ్, తాండ రాము గౌడ్, కందికొండ శ్రీనివాస్ గౌడ్, దమ్మగారి హనుమంత్ గౌడ్, ఎల్లంకి శ్రీనివాస్ గౌడ్, మాదాపూర్ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్, చందానగర్ టిఆర్ఎస్ ఇంచార్జ్ రఘునాథరెడ్డి, హైదర్ నగర్ కార్పొరేటర్ నార్నే శ్రీనివాస్, తెరాస నాయకులు రాజు గౌడ్, విజయ్ ముదిరాజ్, ఎంసిపిఐ (యు) తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వనం సుధాకర్, గ్రేటర్ హైదరాబాద్ కార్యదర్శి తుకారం నాయక్ , నాయకులు టి అనిల్ కుమార్, మైదంశెట్టి రమేష్, కర్ర దానయ్య, పల్లె మురళి దశరధ్ నాయక్, మియాపూర్ డివిజన్ సభ్యులు డప్పు రాములు, కోడిపాక రాజు, రవికాంత్, వెంకటేష్, లక్ష్మణ్ పాల్గోన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here