శేరిలింగంపల్లి, నవంబర్ 28 (నమస్తే శేరిలింగంపల్లి): భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదవీ బాధ్యతలు చేపట్టిన జస్టిస్ సూర్యకాంత్‌ను ఢిల్లీలోని సుప్రీం కోర్టు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ వైస్ చైర్మన్ కె.సునీల్ గౌడ్, అధ్యక్షుడు జగన్, వైస్ ప్రెసిడెంట్ రాజేశ్వర్ రెడ్డి, కార్యదర్శులు విజరత్, ఇంద్రసేనా రెడ్డి, మాజీ కార్యదర్శులు జనార్దన్ గౌడ్, శాంతి భూషణ్, సంయుక్త కార్యదర్శి ఎన్.అనిరుధ్, కోశాధికారి పాపయ్య, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ సెక్రటరీ రాము, నరేష్, ప్రకాష్, శిరీష పాల్గొన్నారు.






