శేరిలింగంపల్లి, మార్చి 24 (నమస్తే శేరిలింగంపల్లి): హఫీజ్‌పేట్ డివిజన్ మదీనాగూడ గ్రామంలో నిర్వహించిన శ్రీ శ్రీ మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రవికుమార్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రవి కుమార్ యాదవ్ మాట్లాడుతూ మల్లన్న స్వామిని మల్లికార్జున స్వామి అని కూడా ప్రజలు భక్తితో పిలుచుకుంటారని మల్లన్న స్వామి శివుని అవతారం, భక్తుల కోరికలు తీర్చే దేవుడిగా ప్రసిద్ధి గాంచి భక్తుల కొంగుబంగారంగా నిలుస్తున్నాడని అన్నారు. మల్లన్న స్వామి భక్తుల కోరికలు తీర్చే కరుణామయుడు. ఆయనను నమ్మినవారికి ఎల్లప్పుడూ అండగా ఉంటాడని, మల్లన్న స్వామికి కులమత భేదాలు లేకుండా అందరినీ సమానంగా చూసే దేవుడు. ఆయన చల్లని చూపులు నియోజకవర్గ ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. నిర్వాహకులు లక్ష్మీనారాయణ గౌడ్, కిషోర్ గౌడ్, సీనియర్ నాయకులు నాగుల గౌడ్, రమేష్ యాదవ్ ,శివకుమార్, యాదగిరి గౌడ్ పాల్గొన్నారు.