తాగునీటి స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాల‌ని విన‌తి

గ‌చ్చిబౌలి (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): గ‌చ్చిబౌలి డివిజ‌న్ ప‌రిధిలోని గోప‌న్‌ప‌ల్లి వీక‌ర్ సెక్ష‌న్ కాల‌నీలో నెల‌కొన్న తాగునీటి స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాల‌ని కోరుతూ మంగ‌ళ‌వారం డివిజ‌న్ బీజేపీ నాయ‌కుడు మ‌ట్ట సురేష్ ఆధ్వ‌ర్యంలో స్థానికులు వాట‌ర్ వ‌ర్క్స్ అధికారుల‌కు విన‌తిప‌త్రాల‌ను అందజేశారు. ఈ సంద‌ర్భంగా వారు స‌మ‌స్య‌ల‌ను త్వ‌ర‌లోనే ప‌రిష్క‌రిస్తామ‌ని హామీ ఇచ్చార‌ని సురేష్ తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో కాల‌నీవాసులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

అధికారుల‌కు స‌మ‌స్య‌ల‌ను వివ‌రిస్తున్న మ‌ట్ట సురేష్, గోప‌న్‌ప‌ల్లి వీక‌ర్ సెక్ష‌న్ వాసులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here