శేరిలింగంపల్లి కాంగ్రెస్ లో వెల్లివిరిసిన ఉత్సాహం… రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి భారీగా తరలిన శ్రేణులు…

నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీలో ఉత్సాహం వెల్లివిరిసింది. టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ప్రమాణ శ్రీకార మహోత్సవానికి శేరిలింగంపల్లి నుంచి ఆ పార్టీ శ్రేణులు పెద్ద మొత్తంలో తరలివెళ్లారు. శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నియోజకవర్గ సమన్వయకర్త రఘునందన్ రెడ్డి అధ్యక్షతన వందల సంఖ్యలో ద్విచక్రవాహనాలపై కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు మొదటగా జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడికి తరలివెళ్లారు. రేవంత్ రెడ్డితో కలిసి అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించి ఆయన వెంట భారీ ర్యాలీగా గాంధీభవన్ కు చేరుకున్నారు. ఈ సందర్భంగా రఘునందన్ రెడ్డి మాట్లాడుతూ రేవంత్ రెడ్డి అధ్యక్ష బాధ్యతలు చేపట్టడంతో కార్యకర్తల్లో ఉత్సాహం నిండిందని, ముఖ్యంగా యువతలో జోష్ రెట్టింపయ్యిందని అన్నారు. రేవంత్ రెడ్డి సారథ్యంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం రావడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు. శేరిలింగంపల్లి లో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి కలసికట్టుగా కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డిసిసి కార్యదర్శి సందీప్ రెడ్డి, కాంటెస్ట్ కార్పొరేటర్లు మహిపాల్ యాదవ్, ఇలియాస్ షరీఫ్, మారెళ్ళ శ్రీనివాస్, రేణుక, భరత్ కుమార్, నగేష్, సీనియర్ నాయకులు రాజన్, సురేష్, జావేద్, తిరుపతి, ప్రణీత్, సయీద్, అరుణ, జగన్ ఇతర నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

చందానగర్ గాంధీ విగ్రహం వద్ద ర్యాలీగా బయలుదేరుతున్న పార్టీ శ్రేణులతో సమన్వయకర్త రఘునందన్ రెడ్డి
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here