నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ సుదాంష్ తో కలిసి మంగళవారం మియాపూర్ డివిజన్ మయూరినగర్ లోని జీహెచ్ఎంసీ పార్కులను స్థానిక కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ పరిశీలించారు. పార్కుల్లో ప్రజల సౌకర్యార్థం మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తామన్నారు. అన్ని వసతులు కల్పించి అహ్లాదకరమైన వాతావరణం ఏర్పాటు చేయాలని అధికారులకు కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ సూచించారు. ఆయన వెంట అర్బన్ బయో డై వర్సిటీ మేనేజర్ చంద్రకాంత్, నోడల్ ఆఫీసర్ రాంమోహన్, జీహెచ్ఎంసీ సిబ్బంది ఉన్నారు.