శేరిలింగంపల్లి, జూన్ 24 (నమస్తే శేరిలింగంపల్లి): శ్యాం ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా చంద్రనాయక్ తండాలో స్థానిక బీజేపీ నేతలు మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బిజెపి మాదాపూర్ కంటెస్టెంట్ కార్పొరేటర్ రాధాకృష్ణ యాదవ్ మాట్లాడుతూ శ్యాం ప్రసాద్ ముఖర్జీ ఒక గొప్ప దేశభక్తుడని, విద్యావేత్త, భారతదేశ ఐక్యతకు పాటుపడ్డ మహానుభావుడని అన్నారు. ఆయన ఒక దేశం, ఒక రాజ్యాంగం అనే నినాదంతో కాశ్మీర్ లో భారత రాజ్యాంగం అమలుకు కృషి చేశారని తెలిపారు. పార్టీ డివిజన్ వైస్ ప్రెసిడెంట్ సుమన్ నాయక్, మహేందర్ యాదవ్, శీను నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు వేణుగోపాల్ రెడ్డి, సెక్రటరీ కిరణ్ రెడ్డి, సత్యనారాయణ శ్రీగిరి, రాగిణి, నరేష్ రెడ్డి, శీను నాయక్, కోటేష్ పాల్గొన్నారు.