చందాన‌గ‌ర్‌లో శ్రీరామ శోభాయాత్ర

చందాన‌గ‌ర్‌‌‌‌ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శ్రీరామ మందిర నిర్మాణంపై ప్రజల్లో చైతన్యం క‌లిగించేందుకు గాను శ‌నివారం చందాన‌గ‌ర్ డివిజ‌న్‌లో శ్రీరామ శోభాయాత్ర నిర్వ‌హించారు. గౌతమీ నగర్ బస్తీలో ప్రారంభ‌మైన ఈ యాత్ర ఫ్రెండ్స్ కాలనీ, శిల్పా ఎన్‌క్లేవ్, అన్నపూర్ణ ఎన్‌క్లేవ్, గంగారం, శ్రీరాం నగర్ కాలనీ, ఇక్రిశాట్ కాలనీ, కెఎస్ ఆర్ లే అవుట్ లో మీదుగా సాగి చివరకు అయ్యప్ప స్వామి దేవాలయంలో ముగిసింది. ఈ కార్యక్రమంలో కసిరెడ్డి భాస్కరరెడ్డి, సింధూ రెడ్డి, త్రినాథ్, శ్రీనివాస్, రాంరెడ్డి, రఘునాథ్ రెడ్డి, రాజ్ జైశ్వాల్, దేవమణి యాదవ్, శ్రీవాణి, నిషాత్, నరేష్, వెంకటేశ్వర్లు, వెంకటేశ్వర్ రావు, ప్రభాకర్, విజయకుమార్ రెడ్డి, అంజి, పాండుగౌడ్, అరవింద్ గౌడ్, మహిళలు, రామభక్తులు పాల్గొన్నారు. వీధుల గుండా శోభాయాత్ర జైశ్రీరామ్ నినాదాలతో నయనానందకరంగా కొన‌సాగింది.

చందాన‌గ‌ర్‌లో శ్రీరామ శోభాయాత్ర నిర్వ‌హిస్తున్న దృశ్యం
యాత్ర ముగింపులో కసిరెడ్డి భాస్కరరెడ్డి, సింధూ రెడ్డి
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here