శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని గోపీనగర్ రోడ్డు నంబర్-3 లో ఉన్న డ్రైనేజీ సమస్యపై స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ కాలనీలో పర్యటించారు. అక్కడ ఉన్న డ్రైనేజీ సమస్యను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్రైనేజీ సమస్యను ఒక్క రోజులోగా పరిష్కరించాలని కాంట్రాక్టర్‌కు సూచించారు. ఈ కార్యక్రమంలో మస్తాన్, సుభాష్, విజయమ్మ, నర్సింహ, ఆంజనేయులు పాల్గొన్నారు.
