నమస్తే శేరిలింగంపల్లి: జాతీయ స్థాయి స్కేటింగ్ పోటీలకు ఎంపికైన క్రీడాకారిణి శ్రేష్ఠను ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి శాసనసభ్యులు ఆరెకపూడి గాంధీ అభినందించారు. ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని తులసివనం కు చెందిన శిరీష మధు దంపతుల కుమార్తె శ్రేష్ఠ రాష్ట్ర స్థాయి పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి స్వర్ణ రజత కాంస్య పథకాలు సాధించి చండిఘర్ లో ఏప్రిల్ 2 నాడు జరుగబోయే జాతీయ స్థాయి స్కెటింగ్ పోటీలకు ఎన్నికవ్వడం అభినందనీయమని గాంధీ అన్నారు. మన ప్రాంతానికి చెందిన క్రీడాకారులు జాతీయ స్థాయిలో రాణించడం గొప్ప విషయమని, అత్యున్నత ప్రమాణాలతో శిక్షణ తీసుకొని రాబోయే రోజుల్లో అంతర్జాతీయ వేదిక మీద పాల్గొని కుటంబ సభ్యులకు, సమాజానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అవని స్వచ్చంద సంస్థ ఛైర్మెన్ శిరీష సత్తుర్, బేబీ శ్రేష్ఠ తల్లిదండ్రులు శిరీష, మధు, కోచ్ లు శ్రీకాంత్, ప్రేమ్ తదితరులు పాల్గొన్నారు.
