నమస్తే శేరిలింగంపల్లి: మాదాపూర్ శిల్పారామంలో కూచిపూడి నృత్య నిలయం, యువ కళావాహిని ఆధ్వర్యంలో భాగవతుల రామకోటయ్య జ్ఞాపకార్థం “స్మృత్యంజలి ” ప్రొఫెసర్ భాగవతుల సేతురాం శిష్య బృందంచే కూచిపూడి నృత్య ప్రదర్శన చేశారు. ప్రముఖ కూచిపూడి నాట్య గురువులైన రమాదేవికి శ్రీ భాగవతుల రామ కోటయ్య పేరిట అవార్డు ప్రధానం చేశారు. సుమారు 30 మంది కూచిపూడి కళాకారులు కూచిపూడి కదంబంలో గజాననమ్, పుష్పాంజలి, నమశ్శివాయతేయ్, జయ జయ రామ, శృంగార లహరి, ఆడెనమ్మా, నీలమేఘ శరీర, వలచి వచ్చే, తిల్లాన అంశాలను ప్రదర్శించారు. ఈ స్మృత్యంజలి కి ముఖ్య అతిధులుగా ప్రముఖ నాట్య గురువులు డాక్టర్ రమాదేవి, నిర్మల ప్రభాకర్, కళా కృష్ణ, వనజ ఉదయ్ హాజరయ్యారు. భాగవతుల రామకోటయ్య కూచిపూడి నాట్యానికి, యక్షగానాలకి చేసిన సేవలను స్మరించుకున్నారు.