గోపన్ పల్లిలో వంద శాతం వ్యాక్సినేషన్: కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి

నమస్తే శేరిలింగంపల్లి: గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గోపన్ పల్లి విలేజ్ లో వంద శాతం వాక్సినేషన్ పూర్తవడంతో గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి ప్రశంసాపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ కరోనా మహమ్మారిని ఎదుర్కోవాలంటే ప్రతి ఒక్కరూ వాక్సిన్ తప్పనిసరిగా వేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. గచ్చిబౌలి డివిజన్ లోని ప్రతి కాలనీలో వంద శాతం వాక్సినేషన్ పూర్తయ్యేలా ప్రజలు ముందుకు రావాలన్నారు. కరోనా తగ్గుముఖం పడుతున్నప్పటికీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కరోనా కట్టడే లక్ష్యంగా ప్రతీ ఒక్కరూ కోవిడ్ వ్యాక్సినేషన్ తీసుకోవాలని సూచించారు. గచ్చిబౌలి డివిజన్ వ్యాప్తంగా పలుచోట్ల మొబైల్ వ్యాక్సిన్ కేంద్రాలను పరిశీలించి పర్యవేక్షించారు. ప్రత్యేక శ్రద్ధతో అందరికి వ్యాక్సిన్ అందేలా కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షుడు హనుమంతు నాయక్, సీనియర్ నాయకులు రంగస్వామి, మధు, నర్సింగ్ రావు, జీహెచ్ఎంసీ ఎస్ ఆర్ పీ భరత్, శానిటేషన్ సూపర్ వైజర్ రఘు, నగేష్, కిరణ్, కార్యకర్తలు పాల్గొన్నారు.

కరోనా వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ ను అందజేస్తున్న కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి

 

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here