నమస్తే శేరిలింగంపల్లి: కాంట్రాక్టర్స్ అసోసియేషన్ సభ్యుల సమస్యలన్నింటిని ప్రభుత్వం దృష్టికి, ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తానని ప్రభుత్వ విప్ ఆరెక పూడి గాంధీ అన్నారు. శేరిలింగంపల్లి జోనల్ కార్యాలయం ఆవరణలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ శేరిలింగంపల్లి జోన్ వారి ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష చేపడుతున్న కాంట్రాక్టర్స్ అసోసియేషన్ సభ్యులకు కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి తో కలిసి నిమ్మరసం ఇచ్చి రిలే నిరాహార దీక్ష విరమింప జేయించారు విప్ గాంధీ. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ సభ్యులకు అన్ని విధాలుగా అండగా ఉంటానని, ఎల్లవేళలో నా వంతు సహాయ సహకారాలు ఉంటాయని హామీ ఇచ్చారు. దీక్ష విరమింప చేసిన వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ మోహన్ గౌడ్, గ్రంథాలయ డైరెక్టర్ గణేష్ ముదిరాజు, శేరిలింగంపల్లి డివిజన్ అధ్యక్షులు మారబోయిన రాజు యాదవ్, చందానగర్ డివిజన్ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి, MIG తెరాస ప్రెసిడెంట్ భాస్కర్, తెరాస నాయకులు ఆదర్శ్ రెడ్డి, సత్యనారాయణ, రఘునాథ్, రమేష్, కృష్ణ యాదవ్, శ్రీకాంత్, అక్బర్ బాయి, సల్లావుద్దీన్, సురేష్ నాయక్, సాయి, మల్లేష్ గౌడ్, కాంట్రాక్టర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.